నూతన రాజధాని భూమిపూజకు స్థలం ఎంపిక | New Capital's Foundation ceremony | Sakshi
Sakshi News home page

నూతన రాజధాని భూమిపూజకు స్థలం ఎంపిక

May 23 2015 4:03 PM | Updated on Oct 17 2018 3:49 PM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజకు స్థలాన్ని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ శనివారం ఎంపిక చేశారు.

గుంటూరు :ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజకు స్థలాన్ని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ శనివారం ఎంపిక చేశారు. తుళ్లూరు మండలంలోని మందడం, తాళ్లాయపాలెం మధ్య తుళ్లూరు జెడ్‌పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రకు చెందిన 25 ఎకరాల స్థలంలో భూమిపూజ చేయాలని నిర్ణయించారు.

 

జూన్ 6వ తేదీన ఉదయం ఎనిమిది గంటల 49 నిమిషాలకు సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. స్థలాన్ని కమిషనర్‌తో పాటు జేసీ శ్రీధర్ , ఎమ్మెల్యే శ్రావణ్ పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement