ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటుకు తప్పిన ప్రమాదం | NDRF Boat Capsize In Godavari At East Godavari | Sakshi
Sakshi News home page

ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటుకు తప్పిన ప్రమాదం

Sep 26 2019 2:58 PM | Updated on Sep 26 2019 7:12 PM

NDRF Boat Capsize In Godavari At East Godavari - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: దేవీపట్నం మండలం మంటూరు వద్ద గోదావరిలో ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. గత రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మళ్లీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లుగా వాతావారణ శాఖ హెచ్చరించింది. బోటు ప్రమాద మృతులను గాలిస్తున్న క్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బోటు మునిగిపోయింది. కాగా అందులో ఉన్న సిబ్బంది లైఫ్‌ జాకెట్‌ ధరించడంతో వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సెప్టెంబర్‌ 15వ తేదీన 71 మంది ప్రయాణికులతో వెళ్తున్న రాయల్‌ వశిష్ట బోటు కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన విషయం విదితమే. లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని వెలికితీయడానికి 10 రోజులుగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement