బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా ఏం సాధించావు? | Naveen nischal takes on Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా ఏం సాధించావు?

Sep 15 2014 2:59 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా ఏం సాధించావు? - Sakshi

బాలకృష్ణ.. ఎమ్మెల్యేగా ఏం సాధించావు?

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు.

అనంతపురం: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేగా వంద రోజులల్లో ఏం సాధించారో శ్వేతపత్రం విడుదల చేయాలని హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త నవీన్ నిశ్చల్ డిమాండ్ చేశారు.

 మూడు ప్రారంభోత్సవాలు, 6 భూమి పూజలు, 9 చెట్లు నాటడం తప్ప చేసింది శూన్యమంటూ విమర్శించారు. హిందూపురం నియోజకవర్గం ప్రజలకు ఏం సేవా చేశారో చెప్పాలని నవీన్ నిశ్చల్ డిమాండ్ చేశారు. టీడీపీ తరపున బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. కాగా గత ఎన్నికల్లో నవీన్ బాలకృష్ణకు గట్టిపోటీనిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement