రాజ్యాంగేతర శక్తిగా నారా లోకేష్: సీఆర్ | nara lokesh behave like extra constitutional, says ramachandraiah | Sakshi
Sakshi News home page

రాజ్యాంగేతర శక్తిగా నారా లోకేష్: సీఆర్

Nov 7 2014 5:15 PM | Updated on Aug 29 2018 3:37 PM

రాజ్యాంగేతర శక్తిగా నారా లోకేష్: సీఆర్ - Sakshi

రాజ్యాంగేతర శక్తిగా నారా లోకేష్: సీఆర్

నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సి. రామచంద్రయ్య ఆరోపించారు.

హైదరాబాద్: నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సి. రామచంద్రయ్య ఆరోపించారు. లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని గతంలో ముద్ర వేసిన చంద్రబాబు... లోకేష్ వ్యవహారంపై ఏమంటారని ప్రశ్నించారు.

ఏపీ రాజధాని నిర్మాణం కోసం పచ్చటి పొలాలు బలవతంగా లాక్కోవడం సరికాదన్నారు. ఈ అంశంపై ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడతారా అని చంద్రబాబు వ్యాఖ్యానించడం తగదని అన్నారు. రెండుసార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన చంద్రబాబు... శ్రీకాకుళంలో పవర్ ప్లాంట్ కోసం పచ్చటి పొలాలు సేకరిస్తారా అని అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం గుర్తుంచుకోవాలని చురక అంటించారు.

చంద్రబాబు తీరు మార్చుకుని ఏకాభిప్రాయంతో రైతుల నుంచి భూమి సేకరించాలని సూచించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ బలవంతంగా భూములు సేకరిస్తామంటే ఎప్పటికీ రాజధాని కట్టలేరని రామచంద్రయ్య అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement