నోరు పారేసుకున్న నన్నపనేని

Nannapaneni Rajakumari Scolds Dalit Woman SI at Chandrababu Residence - Sakshi

సాక్షి, అమరావతి: ‘చలో ఆత్మకూరు’ సందర్భంగా టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ రాజధాని ప్రాంతంలో హల్‌చల్‌ చేస్తూ ఉద్రిక్తతలు పెంచుతున్నారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు దూషణకు దిగడంతో మహిళా ఎస్‌ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్‌ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్‌ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు.

తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అంతకుముందు చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. కాగా, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్‌ఐతో దురుసుగా ప్రవర్తించారు. (చదవండి: మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top