నంద్యాల ఫలితాల అప్ డేట్స్

నంద్యాల ఫలితాల అప్ డేట్స్


సాక్షి, హైదరాబాద్ / నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు.


భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డిపై ఆయన 27వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీకి 97,076...వైఎస్‌ఆర్‌ సీపీకి 69,610, కాంగ్రెస్‌కు 1,382, నోటాకు 1,231 ఓట్లు వచ్చాయి.


► 19వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి :

మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సుమారు 27వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు.►18వ రౌండ్‌ :

26వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ

►17వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి:

టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. 17వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తికాగా, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి  26,523 ఓట్ల తేడాతో లీడ్‌లో ఉన్నారు.

టీడీపీ 86555

వైఎస్‌ఆర్‌ సీపీ 60947

కాంగ్రెస్‌ 1153►16వ రౌండ్‌ లో వైఎస్‌ఆర్‌ సీపీ ఆధిక్యం:

16వ రౌండ్‌ లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం లభించింది. పదహారో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 25,042 ఓట్ల మెజార్టీతో ఉంది.

►15వ రౌండ్‌ :

ముగిసిన 15వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు. 26వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 81,708

వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 55,675

కాంగ్రెస్‌ 1064


►14వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి:

టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. 14వ రౌండ్‌ పూర్తయ్యేసరికి ఆ పార్టీ 24,591 ఓట్ల మెజార్టీతో ఉంది.

టీడీపీ 75938

వైఎస్‌ఆర్‌ సీపీ 51347

కాంగ్రెస్‌ 89813వ రౌండ్‌:

పదమూడవ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ 23,267 ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 70,766

వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 47,499

కాంగ్రెస్‌ 738


12వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు :

12 రౌండ్ల తర్వాత టీడీపీ 21,807కు పైగా ఆధిక్యంలో ఉంది.

టీడీపీ 65,076

వైఎస్‌ఆర్‌ సీపీ 43,269

కాంగ్రెస్‌ 738


11వ రౌండ్‌ :  

పదకొండవ రౌండ్‌ పూర్తయ్యేసరికి 20,227 ఓట్ల మెజార్టీతో టీడీపీ  కొనసాగుతోంది.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 59447

వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 39220

కాంగ్రెస్‌ 516► పదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి:

నంద్యాలలో 10వ రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ 19,137 ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉంది.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 55121

వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 35498

కాంగ్రెస్‌ 516


►తొమ్మిదో రౌండ్‌ :

తొమ్మిదో రౌండ్‌ పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ 18,137 ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది.


►ఎనిమిదో రౌండ్‌ :

ఎనిమిది రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 17,263 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 50479

వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 32342

కాంగ్రెస్‌ 516


► ఏడో రౌండ్‌ పూర్తి :

ఏడో రౌండ్‌ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి టీడీపీ 16,880 ఓట్ల మెజార్టీతో ఉంది. టీడీపీకి 4,859, వైఎస్‌ఆర్‌ సీపీకి 4,347 ఓట్లు పోల్‌ అయ్యాయి.


► ఆరో రౌండ్‌ ఓట్ల లెక్కింపు:

ఆరవ రౌండ్‌లోనూ టీడీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ 16,368 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీకి 6,161,  వైఎస్‌ఆర్‌ సీపీకి పోల్‌ అయిన ఓట్లు 2,858. కాగా ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 36,880 , వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 20,512 కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌ కు 330 ఓట్లు వచ్చాయి.


► ఐదో రౌండ్‌ :

అయిదో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 13,065కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 6,975,  వైఎస్‌ఆర్‌ సీపీకి 3,536 ఓట్లు వచ్చాయి.


► నాలుగో రౌండ్‌ :

నాలుగో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, టీడీపీ 9,653 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీకి 6,465, వైఎస్‌ఆర్‌ సీపీకి  2,859 ఓట్లు పోల్‌ అయ్యాయి.

► మూడో రౌండ్‌ పూర్తి:

మూడు రౌండ్ల తర్వాత టీడీపీ 6,047 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 6,640, వైఎస్‌ఆర్‌ సీపీకి 3,553 వచ్చాయి.


► రెండో రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి:

రెండో రౌండ్‌లోనూ టీడీపీ 1,762 ఓట్లలో ముందంజలో ఉంది. టీడీపీకి 5,162, వైఎస్‌ఆర్‌ సీపీకి 3400 ఓట్లు రాగా,  రెండు రౌండ్ల అనంతరం టీడీపీ 2,960 ఓట్ల ఆధిక్యంలో ఉంది.


తొలి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తి: టీడీపీ తొలిరౌండ్‌లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉంది.  టీడీపీకి 5,477, వైఎస్‌ఆర్‌ సీపీకి 4,279, కాంగ్రెస్‌ కు 69 ఓట్లు వచ్చాయి.


ముగిసిన పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు


పోస్టల్‌ బ్యాలెట్లలో లెక్కింపులో విచిత్రం చోటుచేసుకుంది. నంద్యాలలో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు 250. అయితే 100కు పైగా పోస్టల్‌ బ్యాలెట్లు సకాలంలో చేరలేదు. కేవలం 39 ఓట్లు మాత్రమే సకాలంలో కౌంటింగ్‌ కేంద్రానికి  చేరాయి. కాగా ఆ 39 ఓట్లు కూడా చెల్లవని అధికారులు ప్రకటించారు.


ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు వివరాలు ఎప్పటికప్పుడూ ప్రదర్శిస్తున్నారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ఉదయం 9.30 గంటలకల్లా ట్రెండ్‌ తెలియనుంది. తొలుత నంద్యాల రూరల్‌, తర్వాత పట్టణం, అనంతరం గోస్పాడు మండలం ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రస్తుత ఉపఎన్నిక....

దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (1), గోవా (2), ఢిల్లీ (1) అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం 27 జూలైన షెడ్యూలును విడుదల చేసింది.

కర్నూలు జిల్లాలోని నంద్యాల (139) అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు జూలై 29 న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

ఆగస్టు 5 వ తేదీన నామినేషన్లకు గడువు ముగియడంతో మొత్తం 24 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు.

ఈ నెల 23 (బుధవారం) పోలింగ్ జరగ్గా అనూహ్యంగా మొత్తం 79.20 శాతం పోలింగ్ నమోదైంది.

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషుల (1,07,778) కన్నా మహిళా (1,11,018) ఓటర్లే ఎక్కువగా ఉండగా మొత్తంగా 1,73,335 ఓట్లు (79.20 శాతం) పోలయ్యాయి.తొలిసారి వీవీపీఏటీ ప్రయోగం...

గతంలో అనేక రాష్ట్రాల్లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) విధానాన్నిప్రయోగాత్మకంగా పరిశీలించినప్పటికీ ఈ విధానాన్నిఆంధ్రప్రదేశ్ నంద్యాల ఉపఎన్నికలో తొలిసారి ఉపయోగించారు.

బ్యాలెట్ లేకుండా ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసిన ప్రతి ఓటరుకు తాను ఓటు వేసినట్టుగా ఒక స్లిప్ (ఒక రకంగా రసీదు లాంటిది) వస్తుంది.గత సాధారణ ఎన్నికల్లో....

2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 1,75,140 ఓట్లు (71.32 శాతం) పోలయ్యాయి.

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమా నాగిరెడ్డి పోటీ చేయగా ఆయనకు 82,194 ఓట్లు (47.15 శాతం) రాగా, ప్రత్యర్థిపై 3,604 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

భూమా నాగిరెడ్డి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 78,590 ఓట్లు (45.09 శాతం) ఓట్లు వచ్చాయి.

అప్పటి ఎన్నికల్లో 690 మంది నోటాకు ఓటు వేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top