నగరం ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడి మృతి | Nagaram Tragedy: Death toll rises to 19, one more dead in Kakinada Hospital | Sakshi
Sakshi News home page

నగరం ఘటనలో చికిత్స పొందుతున్న యువకుడి మృతి

Jun 29 2014 11:47 AM | Updated on Sep 2 2017 9:34 AM

తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది.

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో శుక్రవారం గెయిల్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. ఈ ప్రమాదంలో గాయపడి.. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పందొమ్మిదేళ్ల కాసు చిన్నా మృతి చెందారు.  
 
గ్యాస్ పైపులైన్ పేలి పలువురు మరణించగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లడం తెలిసిందే. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై గెయిల్ సంస్థపై, అధికారులుపై పలు కేసులు నమోదు చేశారు. మృతుల బంధువులకు 25 లక్షల పరిహారాన్ని కేంద్ర, రాష్ట్రాలతోపాటు, గెయిల్ సంస్థ ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement