ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు

My Family Votes Not For Sale in West Godavari - Sakshi

పశ్చిమగోదావరి , నరసాపురం రూరల్‌: ఓటును నోటుకు అమ్మితే ఐదేళ్లు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ ప్రచారం చేస్తున్నాడో అభ్యదయ ఓటరు. నరసాపురం మండలం కొప్పర్రుకు చెందిన కుంకటి కాంతారావు అనే రాజకీయ ఓనమాలు తెలిసిన ఓటరు తన ఇంటి గోడపై ‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’ అంటూ రాసిన రాతలు రాజకీయ నాయకులకు చెంపపెట్టులా ఉన్నాయి. ప్రజాసామ్య వ్యవస్థలో ఓటరు తన ఓటు పదును చూపిస్తున్నట్టుగా ఉన్న రాతలు రాజకీయ చైతన్యం తీసుకువస్తాయని పలువురు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని చాటేలా ఉన్న ఈ మాటలు ఆలోచింపజేస్తున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top