నేడు వైఎస్సార్‌ కాంస్య విగ్రహావిష్కరణ | MP Vijayasai Reddy To Unveils YSR Statue Today In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ కాంస్య విగ్రహావిష్కరణ

Sep 2 2019 7:16 AM | Updated on Sep 2 2019 7:18 AM

MP Vijayasai Reddy To Unveils YSR Statue Today In Visakhapatnam - Sakshi

విశాఖ సెంట్రల్‌ పార్కు

సాక్షి,మహారాణిపేట (విశాఖ దక్షిణం): నగరంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వీఎంఆర్‌డీఏ(విశాఖ సెంట్రల్‌) పార్కులో మహానేత కొలువుదీరనున్నారు. వైఎస్సార్‌ పదో వర్ధంతిని పురస్కరించుకుని పార్కులో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖరెడ్డి విగ్రహాన్ని సోమవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆవిష్కరించనున్నారు. వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 18 అడుగుల వైఎస్‌ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. అందులో 14 అడుగులు విగ్రహం, నాలుగు అడుగులు దిమ్మ ఉంది. మొత్తం రూ.22లక్షల వ్యయంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. ఇందులో రూ.12 లక్షలు విగ్రహానికి, రూ.10 లక్షలు విగ్రహం చుట్టూ గ్రానైట్‌ ఏర్పాటుకు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement