
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అసెంబ్లీ లాబీలో కంటతడి పెట్టారు.
హైదరాబాద్ : రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అసెంబ్లీ లాబీలో కంటతడి పెట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాజ్యసభ సీటు ఖాయమని అందరు అనుకున్నారని మోత్కుపల్లి అన్నారు.
రాజ్యసభ సీటు విషయంలో తాను అవమానానికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తలదించుకోకూడదనే కష్టపడి పనిచేశానని అన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లిని మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బుజ్జగించారు. కాగా ఈరోజు ఉదయం మోత్కుపల్లిని ...పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించిన విషయం తెలిసిందే.