
రాజ్యసభ టికెట్ దక్కుతుందనే ఆశలో మోత్కుపల్లి!
టీడీపీ రాజ్యసభ సీట్ల ఎంపిక దాదాపు ఖరారయ్యింది. సీట్ల ఎంపికపై టీడీపీ పొలిట్ బ్యూరో సోమవారం సమావేశమైంది.
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సీట్ల ఎంపిక దాదాపు ఖరారయ్యింది. సీట్ల ఎంపికపై టీడీపీ పొలిట్ బ్యూరో సోమవారం సమావేశమైంది. ఈ అంశంపై పలు దఫాలు చర్చించిన పిదప టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీట్ల ఎంపిక పై తుది నివేదికను సిద్ధం చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుండి సీతారామలక్ష్మిని, తెలంగాణ ప్రాంతం నుంచి గరికపాటి మోహన్ రావులను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కాగా, తెలంగాణా నుంచి రాజ్యసభ సీటు తనకే దక్కుతుందనే ఆశలో మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది.