కుటుంబంలోని సమస్యలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి.
కరీంనగర్: కుటుంబంలోని సమస్యలు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. గత కొంతకాలంగా కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి తగాదాలు కాస్తా తీవ్రరూపం దాల్చడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన జిల్లాలోని జమ్మికుంటలో శుక్రవారం చోటు చేసుకుంది. జీవితం మీద విరక్తి చెందిన ఓ తల్లి తన పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. తాను లేని జీవితంలో పిల్లలు ఉండకూదదని భావించిన ఆ కన్నతల్లి ముందుగా తన ఇద్దరు కూతుళ్లకు విషమిచ్చి వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది.
అనంతరం ఆమె కూడా విషం తాగా ఆత్మహత్యయత్నం చేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.