బావిలో పడి తల్లీ, బిడ్డ మృతి | mother and daughter dies in kurnool district | Sakshi
Sakshi News home page

బావిలో పడి తల్లీ, బిడ్డ మృతి

Feb 17 2016 2:08 PM | Updated on Oct 1 2018 3:56 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

పాములపాడు: కర్నూలు జిల్లా పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో ఉన్న ఓ వ్యవసాయబావిలో ప్రమాదవశాత్తూ పడి తల్లీ, బిడ్డ మృతి చెందారు. గ్రామానికి చెందిన సుజాత(26), కుమార్తె రోషిత(7) తో కలిసి పొలానికి వెళ్లింది. అయితే పని నిమిత్తం బావి దగ్గరకు వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement