పెళ్లి ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి | Mother and daughter died in road accident | Sakshi
Sakshi News home page

పెళ్లి ట్రాక్టర్ బోల్తా: ముగ్గురు మృతి

May 1 2015 7:28 AM | Updated on Sep 28 2018 3:39 PM

కర్నూలు జిల్లా కొస్గి మండలం దొడ్డిబెళగల్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ శుక్రవారం బోల్తా పడింది.

కర్నూలు : కర్నూలు జిల్లా కొస్గి మండలం దొడ్డిబెళగల్ వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరోకరు మరణించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని... అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మృతి చెందిన తల్లీకూతుళ్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement