శ్రీశైల క్షేత్రానికి మరిన్ని సర్వీసులు | More Bus services to Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైల క్షేత్రానికి మరిన్ని సర్వీసులు

Sep 28 2015 6:58 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల మహాక్షేత్రానికి మరిన్ని బస్సు సర్వీసులను కొనసాగిస్తామని ఆత్మకూరు ఆర్టీసీ డిపో నూతన డీఎం హుసేన్ సాహెబ్ అన్నారు.

శ్రీశైల మహాక్షేత్రానికి మరిన్ని బస్సు సర్వీసులను కొనసాగిస్తామని ఆత్మకూరు ఆర్టీసీ డిపో నూతన డీఎం హుసేన్ సాహెబ్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో సోమవారం నంద్యాల నుంచి ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు డిపో నుంచి గతంలో ఉన్న శ్రీశైలం - బెంగుళూరు, శ్రీశైలం - చెన్నై బస్సులతో పాటు నంద్యాల - శ్రీశైలం, కర్నూలు - శ్రీశైలం బస్సు సర్వీసులతో పాటు అదనంగా మరిన్ని పల్లె వెలుగు బస్సుసర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement