కోర్టులో లొంగిపోయిన మోపిదేవి | Mopidevi venkataramana surrenders in Cbi court | Sakshi
Sakshi News home page

కోర్టులో లొంగిపోయిన మోపిదేవి

Oct 24 2013 6:34 PM | Updated on Jul 6 2019 12:52 PM

కోర్టులో లొంగిపోయిన మోపిదేవి - Sakshi

కోర్టులో లొంగిపోయిన మోపిదేవి

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు.

హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆయనకు 31 వరకు రిమాండ్ విధించింది.  

ఇదే కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ మెమో దాఖలు చేయడంతో జగన్‌మోహన్‌రెడ్డి, సాయిరెడ్డి సహా వాన్‌పిక్ కేసులో నిందితులుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర నిందితులందరికీ ప్రత్యేక కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయినందున.. తనకూ బెయిల్ మంజూరు చేయాలని మోపిదేవి తన పిటిషన్‌లో కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement