సైసై సవారీ.... మోనో సైకిల్‌ భళారే | Mono Wheeler Motor Cycle in Visakhapatnam | Sakshi
Sakshi News home page

సైసై సవారీ.... మోనో సైకిల్‌ భళారే

Feb 14 2019 7:46 AM | Updated on Feb 14 2019 7:46 AM

Mono Wheeler Motor Cycle in Visakhapatnam - Sakshi

స్నేహితుడితో మాట్లాడుతూ వాహనంపై ప్రయాణిస్తున్న కాశీ

సవారీ అంటే మనకు గుర్తుకు వచ్చేది రేసు గుర్రమే కదా! ఇప్పుడు సవారీ చేయడానికి సరికొత్త పరికరాలు, వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. సర్కస్‌లో సింగిల్‌ వీల్‌ సైకిల్‌పై ఫీట్స్‌ చేసేవారిని చూసి
ఆశ్చర్యపోతాం. ఇప్పుడు నడి రోడ్డుపైనే సైకిల్‌తో ఫీట్లు వేస్తున్నారు. మోనోవీలర్‌పై ఇప్పుడు 63 ఏళ్ల వ్యక్తి సవారీ చేస్తున్నాడు.

విశాఖపట్నం ,మురళీనగర్‌(విశాఖ ఉత్తర): కాలం మారిన కొద్దీ నూతన వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఒకప్పుడు సైకిల్‌ నుంచి మోటారు సైకిల్, ఆ తర్వాత కారు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పుడు కాలుష్యం ముప్పు పెరగడంతో పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ పరిశోధనల ఫలితంగా బ్యాటరీ వాహనాలు వచ్చాయి.  తాజాగా బ్యాటరీతో నడిచే మోనోవీలర్‌ కూడా మార్కెట్లో దర్శనమిస్తోంది. మన దేశంలో అతి అరుదుగా వాడుతున్నప్పటికీ విశాఖ వీధుల్లోకి ఇప్పుడిప్పుడే దర్శనమిస్తోంది.

63 ఏళ్ల యువకుడు
63 ఏళ్ల యువకుడు ఇప్పుడు నగరంలో సైకిల్‌ ఫీట్లతో సందడి చేస్తున్నారు. కె. కోటపాడు మండలం రొంగలినాయుడు పాలెం గ్రామానికి చెందిన కొల్లి కాశీవిశ్వనాథ్‌ సుజాతనగర్‌లో నివశిస్తున్నారు. ఆయన వయసు 63ఏళ్లు. ఈ వయసులో చాలా జాగ్రత్తగా అవయవాలను కాపాడుకోవాల్సి ఉంటుంది. బయటికి వెళ్లాలంటే  ఏ కారుమీదో, అదీ లేకపోతే ద్విచక్ర వాహనం మీదో ప్రయాణిస్తారు. కానీ ఆయన అందుకు భిన్నంగా మోనో వీలర్‌ పై రయ్‌ .మంటూ రోడ్లపై దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యన వాహనంపై వెళ్తూ ఉంటే ఇతర వాహనాలపై వెళ్తున్న వారందూ ఆగి మరీ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మన నగరంలో ఈ మోనో వీలర్‌ బ్యాటరీ వాహనాన్ని వాడుతున్న ఒకే ఒక వ్యక్తిగా చెప్పవచ్చు.

ఇదోఫ్యాషన్‌
కాశీవిశ్వనాథ్‌  సింగపూర్‌ ఉన్నప్పుడు బ్యాటరీతో నడిచే వివిధ రకాల సైకిళ్ల వాడకాన్ని చూసి మోనో వీలర్‌ ను వాడాలనే ఆసక్తి పెంచుకున్నారు. ఈ వాహనాన్ని ఆయన సెప్టెంబరు 2018 నుంచి వాడుతున్నారు. మొదట్లో దీన్ని బ్యాలెన్స్‌ చేసి నడపడం కష్టమనిపించినా ఇప్పుడు చాలా హాయిగా ఉందని ఆయన చెబుతున్నారు. హ్యాండిల్‌కు బెల్ట్‌ పెట్టి నేర్చుకున్నారు. వాస్తవానికి 20 కిలోమీటర్ల స్పీడుతో దీనిపై ప్రయాణించవచ్చునని ..  తాను మాత్రం సైకిల్‌ స్పీడుతో నడుపుతానని అంటున్నారు. పుట్టిన స్థలం రొంగలినాయుడు పాలెం వెళ్లినప్పుడు కారులో తీసుకుపోయి అక్కడ ఎక్కడికి వెళ్లినా దీనిపైనే ప్రయాణిస్తారు. నగరంలో మార్కెట్‌లకు, స్నేహితుల ఇళ్లకు వెళ్లినప్పుడు మోనోవీలర్‌పై సవారీ చేస్తున్నారు.

మోనో వీలర్‌తో ఎన్నో ప్రయోజనాలు
ఈ హనం బరువు పది కేజీలకు మించదు. దీనికి లిథియం బ్యాటరీ వినియోగిస్తారు.  45 మిషాల్లో పూర్తి చార్జి చేయవచ్చు.ఒకసారి చార్జి చేస్తే 15 లోమీటర్లు ప్రయాణించవచ్చు. ఎక్కడైనా చార్జింగు చేసుకునే వీలుంది. కాలుష్య రహిత వాహనం. ఎంతటి ట్రాఫిక్‌ చైనా సులువుగా తప్పించుకుని ప్రయాణించవచ్చు. శారీరక వ్యాయామం ఉంటుంది.   

పర్యావరణ హితం
మారుతున్న కాలంలో ఇలాంటి వాహనాలు చాలా అవసరం. పర్యావరణహిత వాహనంగా ఇది పయోగపడుతుంది. దీనిపై ప్రయాణం  వల్ల  వ్యాయామం కలుగుతుంది. దీన్ని వెనక్కి కూడా  ఒడుపుగా ప్రయాణించవచ్చు. ఒకసారి అలవాటైతే ఎక్కడికి వెళ్లాలన్నా దీన్నే వాడాలనిపిస్తుంది. స్కేటింగు నేర్చుకున్నవారు దీనిని నడపడం చాలా సులువు.– కాశీవిశ్వనాథ్, మోనోవీలర్‌ రైడర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement