టీడీపీ నేతకు ప్రభుత్వం నోటీసులు

Mogga Sitaramaiah Occupied Government Land In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న టీడీపీ నేత మొగ్గ సీతారామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మూడు గంటల్లోగా స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా సీతారామయ్యను ప్రభుత్వం హెచ్చరించింది. పెందుర్తి మండలం సుజాతనగర్‌ బీహెచ్‌పీవీ లేఅవుట్‌లో స్థలాన్ని ప్రభుత్వం రైతు బజార్ ఏర్పాటుకు కేటాయించింది. ఈ స్థలంపై కన్నేసిన టీడీపీ నేత మొగ్గ సీతారామయ్య ఆక్రమణకు పూనుకున్నారు.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో తేజ్‌ భరత్‌ క్షేత్ర పరిశీలనకు వెళ్లగా మొగ్గ సీతారామయ్య బిల్డింగ్‌ మెటీరియల్‌ వేసి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని తేలింది. దీంతో స్థానిక ఎమ్మార్వో, పోలీసులతో కలిసి కబ్జాకు గురైన భూమిని పరిశీలించి, మూడు గంటల్లో స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా టీడీపీ నాయకుడు మొగ్గ సీతారామయ్యకు నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువులోగా ఖాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top