మోదీ, చంద్రబాబుది నమ్మక ద్రోహం | Modi, Chandrababu of confident betrayal | Sakshi
Sakshi News home page

మోదీ, చంద్రబాబుది నమ్మక ద్రోహం

May 7 2016 3:16 AM | Updated on Mar 23 2019 9:10 PM

మోదీ, చంద్రబాబుది నమ్మక ద్రోహం - Sakshi

మోదీ, చంద్రబాబుది నమ్మక ద్రోహం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్రప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయవాడ (కృష్ణలంక) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్రప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. రామవరప్పాడు సెంటర్‌లో సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భారీగా కాగడాలతో ప్రదర్శన చేశారు. అనంతరం బాబూజగ్జీవన్‌రామ్ విగ్ర హం సమీపంలో జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను విస్మరించి రెండేళ్లుగా ప్రజలను మోసగిస్తున్నాయని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా కావాలో, బీజేపీతో సంబంధాలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ మోదీపై నమ్మక ద్రోహం కేసులు పెట్టాలన్నారు. ప్రత్యేక హోదా కోసం శనివారం నుంచి మూడు రోజులపాటు అనంతపురంలో పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఆసుల రంగనాయకులు, నేతలు జి.కోటే శ్వరరావు, లంక దుర్గారావు, మహిళ సమాఖ్య నాయకులు ఓర్సు భారతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement