'పట్టిసీమ ఆపండి.. పోలవరం కట్టండి' | mm pallam raju demand for polavaram project completion | Sakshi
Sakshi News home page

'పట్టిసీమ ఆపండి.. పోలవరం కట్టండి'

Jun 23 2015 5:38 PM | Updated on Aug 21 2018 8:34 PM

'పట్టిసీమ ఆపండి.. పోలవరం కట్టండి' - Sakshi

'పట్టిసీమ ఆపండి.. పోలవరం కట్టండి'

ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు డిమాండ్ చేశారు.

కాకినాడ: ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు డిమాండ్ చేశారు. ఈ కేసులో దోషులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం పోతుందని అన్నారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నిర్మాణాన్ని నిలిపివేసి ముందుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు ప్రారంభించారని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement