నేడు ఎమ్మెల్సీ కోలగట్ల రాక | MLC kolagatla veerabhadra swamy tour in Vizianagaram | Sakshi
Sakshi News home page

నేడు ఎమ్మెల్సీ కోలగట్ల రాక

Apr 2 2015 3:59 AM | Updated on May 25 2018 9:20 PM

నేడు ఎమ్మెల్సీ కోలగట్ల రాక - Sakshi

నేడు ఎమ్మెల్సీ కోలగట్ల రాక

శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి

 విజయనగరం మున్సిపాలిటీ :  శాసనమండలి సభ్యునిగా ఎన్నికైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి  గురువారం విజయనగరం రానున్నారు. శాసనమండలి సభ్యునిగా పదవీ బాధ్యతలు స్వీకరించి   పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలకడంతో పాటు అభినందన సత్కార సభ నిర్వహించేందుకు వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పా ట్లు చేస్తున్నారు.    జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ నాయకులు స్వాగ తం పలుకుతూ   ఫ్లెక్సీలు ఏర్పాటు చేశా రు. విజయనగరం పట్టణంలోని ప్రధాన జంక్షన్‌లతో పాటు అన్ని రహదారులకు ఇరువైపులా  ఆయన అభిమానులు స్వా గతం పలుకుతూ,  శుభాకాంక్షలు తెలుపు తూ  ఫెక్సీలు ఏర్పాటు చేశారు.
 
 దీంతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది.  గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డెంకాడ మండలం చింతవలస   గ్రామం వద్ద పార్టీ విజయనగరం నియోజకవర్గం నాయకులు కోలగట్లకు ఘన స్వాగతం పలికి,  అనంతరం కార్ల ర్యాలీతో ఊరేగింపు ప్రారంభిస్తారు. అక్క డి నుంచి వీటీ అగ్రహారం వై జంక్షన్‌కు చేరుకుని పార్టీ నాయకులు ఏర్పాటు చేసే భారీ మోటారు సైకిళ్లతో  పట్టణ వీధుల్లో ఊరేగింపు సాగనుంది. వై జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు మయూ రి జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్, వైఎస్‌ఆర్‌జంక్షన్, ఎన్‌సీఎస్‌రోడ్, కన్యకాపరమేశ్వరి కోవెల, గంట స్తంభం జంక్షన్, మె యిన్‌రోడ్, మూడులాంతర్ల జంక్షన్ మీ దుగా కోట జంక్షన్ వరకు సాగుతుంది.
 
 అనంతరం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసే  అభినందన సత్కార సభలో కోలగట్లను ఘనంగా సత్కరించనున్నారు. అనంతరం   బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏ ర్పాట్లలో ఆ పార్టీ నాయకులు తలమునకలై ఉన్నారు. ర్యాలీలో పాల్గొనే  వారికి కోలగట్ల చిత్రపటంతో ముద్రించిన టీ షర్టులు, టోపీలను పంపిణీ చేయనున్నారు.    ఈ కార్యక్రమాన్ని ఆధ్యాంతం జిల్లా వాసులంతా తిలకించే విధంగా ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నారు. స్థానిక మీడియా ఛానల్స్ సిటీ కేబుల్, సత్యవిజన్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక ప్రసారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement