ఆస్పత్రి నుంచి రోజా డిశ్చార్జ్ | mla rk roja discharged from svims hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి రోజా డిశ్చార్జ్

Apr 12 2015 5:03 PM | Updated on Sep 3 2017 12:13 AM

ఆర్కే రోజా(ఫైల్ ఫోటో)

ఆర్కే రోజా(ఫైల్ ఫోటో)

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆదివారం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు.

తిరుపతి: టీడీపీ నాయకులు కుట్రపన్ని పోలీసులతో కుమ్మక్కై తనపై కేసు పెట్టారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా  నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై అక్రమంగా కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి నుంచి ఆమెను ఆదివారం డిశ్చార్జ్ చేశారు.

పుత్తూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేసిన రోజా అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వైఎస్సార్‌సీపీ నేతలు హుటాహుటిన ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement