ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

MLA Kottu Satyanarayana Said Strict Action Will Be Taken If Commodities Are Sold At High Prices - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ

సాక్షి, తాడేపల్లిగూడెం: అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే  కొట్టు సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉందని అనవసరంగా రోడ్డు ఎక్కితే ఉపేక్షించేది లేదన్నారు. వాహనాలను కూడా పోలీసులు సీజ్‌ చేస్తారని పేర్కొన్నారు. కరోనా సాకుతో నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (‘లాక్‌డౌన్‌ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’)

ప్రజలు ఎవరూ భయపడొద్దని.. అన్ని వేళ్లలో అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలు వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని..పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ నెల 31 వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
(సామజవరగమనా, నేనిల్లు దాటగలనా!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top