breaking news
Commodities hike
-
నిత్యావసరాల ధరలు పెంచితే చర్యలు..
సాక్షి, తాడేపల్లిగూడెం: అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు రావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉందని అనవసరంగా రోడ్డు ఎక్కితే ఉపేక్షించేది లేదన్నారు. వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేస్తారని పేర్కొన్నారు. కరోనా సాకుతో నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (‘లాక్డౌన్ ఉల్లంఘనులను ఉపేక్షించొద్దు’) ప్రజలు ఎవరూ భయపడొద్దని.. అన్ని వేళ్లలో అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలు వెంటనే తెలియజేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని..పరిశుభ్రత పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవచ్చన్నారు. ఈ నెల 31 వరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (సామజవరగమనా, నేనిల్లు దాటగలనా!) -
పెరిగిన పెట్రో ధరలు
–పెరగనున్న నిత్యావసరాలు, కూరగాయల ధరలు నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ స్థాయిలో క్రుడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోలు, డిజిల్ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై రూ 3.38 పైసలు, డిజిల్‌పై రూ.2.67పైసలు పెంచింది. పెరిగిన ధరలు బుధవారం ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో వినియోగదారులపై రోజుకు రూ.36 నుంచి రూ.40 లక్షల భారం పడుతుంది. పెరిగిన ధరల ప్రకారం పెట్రోలు రూ.70.50లు పైన, డిజిల్ రూ.60.75లు పైన ఉండవచ్చు. ప్రస్తుతం పెట్రోలు లీటర్ రూ.65.97 పైసలు, డిజిల్ రూ.57.03పైసలుగా ఉన్నాయి. జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.12 కోట్లకుపైగా భారం పడుతుంది. జిల్లాలో సుమారు 280కిపైగా పెట్రోలు బంకులున్నాయి. నిత్యం 4 లక్షల లీటర్ల పెట్రోలు, 6.50 లక్షల లీటర్ల డిజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో లీటర్‌కు రూ.4 అధికం. దీంతో పాటు నిత్యావసరసరుకులు, కూరగాయల ధరలు పెరిగే అవకాశం ఉంది. -
చుక్కల్లో నిత్యావసరాల ధరలు!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నారుు. బియ్యం, కందిపప్పు, పెసర పప్పు ధరలు భగ్గుమంటున్నాయి. వేరుశనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు ధరలూ కొండెక్కాయి. చుక్కలనంటుతున్న రేట్లతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొత్త ధాన్యం మార్కెట్లోకి రాగానే బియ్యం ధరలు దిగిరావాల్సి ఉండగా మరింత పెరగడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో సోనా మసూరి పాత బియ్యం కిలోకు రూ.46 నుంచి రూ.48 వరకూ పలుకుతున్నారుు. అరుుతే సోనామసూరి కొత్త బియ్యం కూడా కిలో రూ.36కు తగ్గడం లేదు. నాణ్యతను బట్టి వ్యాపారులు రూ.38 వరకూ అమ్ముతున్నారు. ప్రథమ శ్రేణి బియ్యంగా పరిగణించే హెచ్ఎంటీ పాత బియ్యం ధర కిలో రూ.54 నుంచి రూ.56 వరకూ పలుకుతున్నారుు. ఇక కంది పప్పు కిలో రూ.60 నుంచి రూ.85 - 90కి చేరింది. వేరుశనగపప్పు ధర రూ.75 - 80 నుంచి రూ.130కి పెరిగిపోయింది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కి కిలో రూ.120 పలుకుతోంది. మూడు నెలల కిందట రూ. 65 -70 ఉన్న కిలో పెసర పప్పు ధర ప్రస్తుతం రూ.120 - 130కి పెరిగింది. బెల్లం ధర కిలో రూ. 40 నుంచి రూ. 60కి పెరిగిపోయింది. పుట్నాలు రూ.60 నుంచి రూ. 90కి చేరారుు. పచ్చడన్నమూ భారమే.. పెసరపప్పు ధర రెట్టింపయిన నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొంగలికి స్వస్తి చెప్పారు. హోటళ్ల పొంగలిలో పెసరపప్పు పలుచబడింది. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగానే ఉందని పేదలు వాపోతున్నారు. చింతపండు, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు కూడా భారీగా పెరగడమే ఇందుకు కారణం. చింతపండు ధర కిలో రూ. 50 నుంచి రూ.100కు చేరింది. ఎండుమిర్చి రూ.120 వరకూ పలుకుతోంది. కిలో రూ.250తో నువ్వులు సామాన్యులకు అందుబాటులోనే లేవు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ.130 పైనే పలుకుతుండటంతో పేదలకు దిక్కుతోచడం లేదు. అమ్మో! పెసరపప్పూ, పానకమా? ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో వడపప్పూ, పానకంతో కూడిన ప్రసాదం పంపిణీ అంటేనే పేద, మధ్య తరగతి వారు బెంబేలెత్తుతున్నారు. వారం రోజుల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నారుు. అరుుతే బెల్లం, పెసరపప్పు ధరలు భారీగా పెరగడం పట్ల ఉత్సవాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రసాద వితరణ ఖర్చు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందని అంటున్నారు.