భవానీ ద్వీపాన్ని సందర్శించిన మంత్రులు

Ministers Avanti, Velampalli Visit Bhavani Island - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో నెలవైన భవానీ ద్వీపాన్ని మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపం అభివృద్ధితోపాటు పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పించడం వంటి అంశాలపై అధికారులతో మంత్రులు చర్చించారు. పర్యాటక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన విషయమై అధికారులతో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతోపాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top