విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి 7 గంటలు దాటాక ఇంద్రకీలాద్రికి వచ్చారు. రాష్ట్రపతికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, ఆలయ వేద పండితులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి.. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ద్రౌపది ముర్ము ఇంద్రకీలాద్రికి వచ్చారు. ద్రౌపది ముర్ము పర్యటన దృష్ట్యా కొండపై వాహనాల రాకపోకలు, ప్రోటోకాల్ దర్శన వేళల్లో మార్పులు చేశారు. భద్రత దృష్ట్యా కొండపైకి అన్ని రకాల వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. నేటి రాత్రి 7.45 గంటల నుంచి కేటాయించిన ప్రోటోకాల్ స్లాట్ను కూడా పూర్తిగా రద్దు చేశారు.


