మా పరిధి కాదు.. మేం రాం! | Vijayawada West Bypass Road Incident | Sakshi
Sakshi News home page

మేజర్‌ కారు ప్రమాదం జరిగినా స్పందించరా?

Oct 14 2026 8:48 AM | Updated on Oct 14 2026 8:48 AM

 Vijayawada West Bypass Road Incident

ప్రమాదంలో కారు దహనం అవుతున్న దృశ్యం (ఫైల్‌)

లబ్బీపేట(విజయవాడతూర్పు): వెస్ట్‌ బైపాస్‌పై సోమవారం సాయంత్రం కారు ప్రమాదం జరిగితే, అది ఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిందో తహసీల్దార్‌ తేల్చాల్సి వచ్చింది. కారు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు స్పందించినా, పోలీసుల్లో మాత్రం చలనం లేకపోయింది. అది మా పరిధి కాదంటూ ఆ ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న భవానీపురం, కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ల హౌస్‌ ఆఫీసర్స్‌ చెప్పడం ఆ శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. నలుగురు సజీవ దహనం అయినట్లు వార్తలు వస్తున్నా వారిలో చలనం రాలేదు కదా కనీసం స్పందించాల్సింది పోయి మా పరిధి కాదంటూ తేల్చేశారు. ఘటన జరిగిన గంటన్నరకు ప్రమాదస్థలానికి ఇబ్రహీంపట్నం పోలీసులు చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించాల్సి వచ్చింది.  

తహసీల్దార్‌ తేల్చాల్సి వచ్చింది
ప్రమాద ప్రాంతం నుంచి సోమవారం రాత్రి మృతదేహాలను ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంపై ఎవరికి వారు తమది కాదని చెపుతుండటంతో ఆ ప్రాంత తహసీల్దార్‌ రంగంలోకి దిగాల్సి వచ్చింది. తహసీల్దార్‌  ప్రమాద ప్రాంతంలోకి వెళ్లి తమ వద్ద ఉన్న ప్లాన్‌ ఆధారంగా ఆ ప్రాంతం భవానీపురం స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని తేల్చాల్సి వచ్చింది. అప్పుడు భవానీపురం పోలీసులు స్పందించారు. కొత్తపేట, భవానీపురం స్టేషన్‌ల మధ్య ఘటన జరిగినా వాళ్లు స్పందించక పోవడంతో ఇబ్రహీంపట్నం వాళ్లు రావాల్సి వచ్చింది. 

సాధారణ విధులు పట్టించుకోరా?
ప్రస్తుతం నగర పోలీసులకు అంతా ఉత్సవాల బందోబస్తు డ్యూటీ ఉన్నాయి. అయినప్పటికీ ఏదైనా ఘటన జరిగినప్పుడు స్పందించేందుకు కొందరు సిబ్బంది ఉంటారు. కానీ సోమవారం సాయంత్రం జరిగిన కారు ప్రమాదం, నలుగురు స్పాట్‌ డెడ్‌ అయిన ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఉన్నతస్థాయి వ్యక్తులు          స్పందించినా పోలీసుల్లో చలనం లేకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement