మంత్రి రావెల కుట్రలు సాగవు | Minister ravela conspiracies stretch | Sakshi
Sakshi News home page

మంత్రి రావెల కుట్రలు సాగవు

Mar 14 2016 4:11 AM | Updated on Aug 29 2018 7:45 PM

మాదిగల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణను.. అందు కోసం చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకు మంత్రి రావెల .....

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లవరపు  
 
మంగళగిరి : మాదిగల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణను.. అందు కోసం చేసే ఉద్యమాన్ని అణచివేసేందుకు మంత్రి రావెల కిషోర్‌బాబు చేస్తున్న కుట్రలు సాగవని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లవరపు నాగయ్య అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హాహీ నెరవేర్చేవరకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు. కాదని ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గుంటూరు ఎలీషా, కలకోటి నాగేశ్వరరావు, ఇందుపల్లి రామారావు, పులివర్తి నథానియేలు, చిలువూరు నాగరాజు, శివాజి, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement