ఏపీ మంత్రి గారు చాలా బిజీ..! | minister prathipati pulla rao not responded to sakshi reporter | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రి గారు చాలా బిజీ..!

Jul 3 2015 5:28 PM | Updated on Aug 20 2018 8:20 PM

ఏపీ మంత్రి గారు చాలా బిజీ..! - Sakshi

ఏపీ మంత్రి గారు చాలా బిజీ..!

అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి (29) ఆత్మహత్య ఘటనపై స్పందించడానికి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరాకరించారు.

గుంటూరు : అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి (29) ఆత్మహత్య ఘటనపై స్పందించడానికి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరాకరించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆయన నివాసం వద్ద మంత్రి స్పందన కోసం 'సాక్షి' మీడియా ప్రతినిధి రెండు గంటలకు పైగా వేసి చూసినా  ముఖం చాటేశారు. మంత్రి ప్రత్తిపాటి నివాసం వద్ద చాలా సమయం ఎదురుచూసిన తర్వాత మంత్రి బిజీగా ఉన్నారంటూ చెప్పిన ఆయన పీఏ, గన్మన్ లు సాక్షి' ప్రతినిధిని పంపించేశారు.

బ్యాంకు మేనేజర్ ఒత్తిళ్లు భరించలేక ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో రైతు కోదండరామిరెడ్డి పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఉద్యోగం రాక చివరకు వ్యవసాయమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఆ యువరైతు చదివింది ఎంబీఏ కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement