అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం | Minister Chinarajappa comments on Mudragada padayatra | Sakshi
Sakshi News home page

అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం

Jul 27 2017 2:41 AM | Updated on Jul 30 2018 7:57 PM

అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం - Sakshi

అనుమతి తీసుకునే వరకూ అడ్డుకుంటాం

ప్రభుత్వ అనుమతి తీసుకునే వరకూ ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటూనే ఉంటామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

ముద్రగడ పాదయాత్రపై హోం మంత్రి చినరాజప్ప
 
సాక్షి, అమరావతి: ప్రభుత్వ అనుమతి తీసుకునే వరకూ ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటూనే ఉంటామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. బుధవారం తాత్కాలిక సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదని.. విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లోనే రిజర్వేషన్లు కావాలన్నారు.

త్వరితగతిన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరామని చెప్పారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ.. ఎటువంటి హింస జరగదని ముద్రగడ హామీ ఇస్తేనే పాదయాత్రకు అనుమతిస్తామని చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement