ఆడవాళ్ల నుంచి రక్షణ కావాలంటున్న మగాళ్లు | men want protection from-women | Sakshi
Sakshi News home page

ఆడవాళ్ల నుంచి రక్షణ కావాలంటున్న మగాళ్లు

Nov 19 2013 6:27 PM | Updated on Sep 2 2017 12:46 AM

ఆడవాళ్ల నుంచి మమ్ముల్ని రక్షించాలని మగాళ్ల విజ్ఞప్తి. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించి మగాళ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది

విశాఖ: ఆడవాళ్ల నుంచి మమ్ముల్ని రక్షించాలని మగాళ్ల విజ్ఞప్తి. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించి మగాళ్ల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఈవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. దీన్ని సందర్భంగా చేసుకున్న కొంతమంది పురుష పుంగవులు తమకు మహిళల నుంచి రక్షణ కల్పించాలంటూ విన్నవించారు. తమకు ప్రత్యేక మినిస్టరీ కేటాయించాలంటూ మొరపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న 498-A చట్టాన్ని బెయిల్బుల్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ చట్టం రూపొందించబడింది. కాగా, కొంతమంది ఈ చట్టాన్ని దుర్వినియోగ పరుస్తూ జీవితాల్ని నాశనం చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. దీనిని బెయిల్బుల్ చేస్తే తమకు రక్షణ కల్పించిన వారవుతారని మగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

సరిగ్గా ఈరోజే దేశంలో మొట్ట మొదటి మహిళా బ్యాంకు ప్రారంభమైంది. గత బడ్జెట్‌లో చిదంబరం చేసిన ప్రకటన ద్వారా  ఈ బ్యాంకు రూపుదిద్దుకుంది. తొలి బ్రాంచ్‌ ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ప్రారంభమైంది. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీలు ముంబాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తొలి బ్రాంచ్‌ను ప్రారంభించారు. బ్యాంకు పేరు.. భారతీయ మహిళా బ్యాంకు. ఇది కేవలం మహిళల కోసం మాత్రమే పని చేస్తోంది. ఇందులో సాధ్యమైనంత వరకు మహిళల్నే ఉద్యోగులుగా తీసుకుంటారు. బ్యాంకు బోర్డులో 8 మంది మహిళా డైరెక్టర్లను నియమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement