యువతిపై అత్యాచారం

Men Gang rape women in Anantapur district - Sakshi

పోలీసులమంటూ బెదిరించి బలత్కారం

 నిందితులు గతంలో గొర్రెల దొంగలు

అనంతపురం సెంట్రల్‌: ప్రియుడితో కలిసి షికారుకెళ్లిన ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన గురువారం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు వర్గాలు తెలిపిన మేరకు... హిందూపురానికి చెందిన ఓ యుతి అనంతపురంలో ఉంటూ చదువుకుంటోంది. చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఆత్మకూరు మండలం పంపనూరు దేవాలయానికి గురువారం వెళ్లింది. దారి మధ్యలో ఆగి కబుర్లు చెప్పుకుంటుండగా ఇద్దరు యువకులు పోలీసులమంటూ అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? పోలీసు స్టేషన్‌కు పదండంటూ బెదిరించారు. బెదిరిపోయిన ఆ యువతిని తమ బైక్‌లో ఓ వ్యక్తి ఎక్కించుకొని ఆత్మకూరు వైపు వెళ్లాడు.

కొంత దూరం వెళ్లిన తర్వాత చెట్లపొదల్లోకి తీసుకు పోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి బా«ధితులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం నిందితులను గుర్తించినట్లు తెలిసింది. సదరు నిందితులు గతంలో గొర్రెల దొంగలుగా తేలింది. అయితే బాధిత యువతి ఫిర్యాదు చేయడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఏం చేయాలనే విషయంపై పోలీసు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. అత్యాచారం కేసు నమోదు చేయకపోయినా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top