టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ | Mass copying | Sakshi
Sakshi News home page

టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

Apr 4 2014 12:33 AM | Updated on Nov 9 2018 4:12 PM

జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో గురువారం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు.

ఏలూరు (ఫైర్‌స్టేషన్‌సెంటర్), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో గురువారం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు.  విద్యార్థులకు సహకరించిన ఐదుగురు అధికారులను విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
 
పూళ్లలో మాస్ కాపీయింగ్ చేస్తున్న ఇద్దరిని, ఇక్కడ ప్రోత్సహించిన పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, డిపార్డుమెంటల్ అధికారులను, తాడిమళ్లలో స్లిప్‌లతో పరీక్ష రాస్తూ ఫ్లయింగ్ స్క్వాడ్‌కు పట్టుబడ్డ ముగ్గురిని డిబార్ చేసి ఆ పరీక్షా కేంద్ర చీఫ్ సూపరిం టెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రగడవరంలో పరీక్షా కేంద్రం చుట్టూ వందలాది కాపీస్లిప్‌లు ఫ్లయింగ్ స్క్వాడ్‌కు దొరకడంతో దీనికి బాధ్యులుగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశామన్నారు. కొన్ని కేంద్రాల్లో  సిబ్బంది ప్రోత్సాహంతోనే మాస్ కాపీయింగ్ జరగడంతో వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
 
విధుల్లోకి తీసుకోకపోతే బహిష్కరణ అస్త్రం
సస్పెండ్ చేసిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోని పక్షంలో మిగిలిన పరీక్షల విధులను జిల్లాలోని ఉపాధ్యాయులంతా బహిష్కరిస్తారని ఉపాధ్యాయ సం ఘాల నాయకులు రెవెన్యూ శాఖను హెచ్చరించారు. ఏ తప్పూ చేయని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో మానసిక క్షోభకు గురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ మేరకు హెడ్మాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ, ఎస్‌టీయూ అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు, పీఆర్‌టీయూ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, యూటీఎఫ్ అధ్యక్షుడు ఎస్.శ్రీకాంత్ ఓ ప్రకటన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement