మార్కెట్ యూర్డు గోదాంకు తాళాలు | Market yurdu godanku locks | Sakshi
Sakshi News home page

మార్కెట్ యూర్డు గోదాంకు తాళాలు

Feb 29 2016 12:22 AM | Updated on Oct 9 2018 2:17 PM

ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ గోదాంలో కళాసీ పను ల కోసం టీడీపీ నాయకుల మధ్యనే వివాదం నెలకొంది.

 లావేరు: ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ గోదాంలో కళాసీ పను ల కోసం టీడీపీ నాయకుల మధ్యనే వివాదం నెలకొంది. బెజ్జిపురం గ్రామస్థులకే గోదాంలో కళాసీ పనులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బె జ్జిపురం టీడీపీ సర్పంచ్, ఎంపీటీసీలు ఇజ్జాడ శ్రీనివాసరావు, దన్నాన అజాద్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులుతో పాటు గ్రామస్థులు పలువురు వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తోటయ్యదొరపై బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ,  గ్రామస్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీ యార్డులో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ గోదాంలో లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాలకు సరఫరా చేయడం కోసం పౌర సరఫరాల బియ్యా న్ని నిల్వ చేస్తున్నారు. అయితే గోదాంకు వచ్చిన బియ్యా న్ని దించడం కోసం కళాసీలుగా లావేరు గ్రామానికి చెందిన వారికి మార్కెట్ కమీటీ చైర్మన్ పనులు అప్పగించారు. అయితే, బెజ్జిపురం రెవెన్యూ పరిధిలో ఉన్న గోదాంలో కళాసీ పనులను బెజ్జిపురం గ్రామానికి చెంది న వారికే ఇవ్వాలని, లావేరుకు  చెందిన కళాసీలకు ఎలా ఇస్తారని నాలుగు రోజుల క్రితమే బెజ్జిపురం సర్పంచ్, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌లు  మార్కెట్ కమిటీ చైర్మన్ వద్ద అభ్యంతరం చెప్పారు.
 
  అయినా పట్టించుకోకుండా లావేరుకు చెందిన కళాసీలతోనే గోదాంలో బియ్యం బస్తాలు దించడం చేస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన బెజ్జిపురం సర్పంచ్ ఇజ్జాడ శ్రీనివాసరావు, ఎంపీటీసీ దన్నాన అజార్, మాజీ సర్పంచ్ ఇజ్జాడ అప్పారావులతో పాటు గ్రామస్థులు పలువురు ఆదివారం ఉదయం వచ్చి మార్కెట్ కమిటీ గోదాంకు తాళాలు వేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు వచ్చి తాళాలు వేసిన వారు తలుపులకు అడ్డంగా కూర్చోని మధ్యాహ్నం 12 గంటల వర కూ ఉన్నారు.
 
 గోదాంలో కళాసీ పనులు బెజ్జిపురం గ్రామస్థులుకే  ఇవ్వాలని వారంతా నినాదాలు చేశారు.  దీంతో బియ్యం లోడులతో వచ్చిన లారీలు మార్కెట్ యార్డులో బారులు తీరాయి. గోదాంకు తాళాలు వేసి పనులు అడ్డుకున్న వారు చైర్మన్ రావాలని డిమాండ్ చేసినా మధ్యాహ్నం 12 గంటలయినా ఏఎంసీ చైర్మన్ అక్కడకు రాకపోవడంతో సర్పంచ్, ఎంపీటీసీలు వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement