విశాఖ పట్నం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పట్నం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పెద్దబయలు మండలం గుండెలం వద్ద మంగళవారం ల్యాండ్ మైన్ ను పేల్చివేశారు. పోలీసులే లక్ష్యంగా ఈ ఘటనకు పాల్పడ‍్డారు. గుండెలం వద్ద ఈరోజు తెల్లవారు జామున పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఇదే అదనుగా భావించిన మావోయిస్టులు ల్యాండ్‌మైన్‌ను పేల్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.