నంద్యాలలో వ్యక్తి దారుణహత్య


నంద్యాల: కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని నంద్యాల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని రైతు నగర్ గ్రామంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని బండరాళ్లతో మోది దుండగులు హత్య చేశారు. ఈ విషయాన్ని సోమవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునిదర్యాప్తు ప్రారంభించారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top