పట్టపగలు వ్యక్తి దారుణ హత్య | man murdered in chittoor | Sakshi
Sakshi News home page

పట్టపగలు వ్యక్తి దారుణ హత్య

Mar 28 2015 5:54 PM | Updated on Aug 29 2018 8:36 PM

చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చిన్నకొండమర్రి సమీపంలోని బాలయ్యగుండ్ల వద్ద ఓ వ్యక్తిని శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

చౌడేపల్లి : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చిన్నకొండమర్రి సమీపంలోని బాలయ్యగుండ్ల వద్ద ఓ వ్యక్తిని శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వ్యక్తిని శెట్టిపేట పంచాయతీలోని అజ్జపల్లి గ్రామానికి చెందిన పి.రెడ్డప్ప రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆధారాల సేకరణ కోసం సంఘటనా స్థలానికి క్లూస్ టీంను రప్పిస్తున్నట్లుగా సమాచారం.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement