డాలర్‌ శేషాద్రికి కరోనా అంటూ అసత్య పోస్టులు

Man Mislead People As Dollar Seshadri Tests Corona Positive Case Filed - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ సోషల్ మీడియాలో అసత్య పోస్టులు హల్‌చల్‌ చేశాయి. దీనిపై ఆయన టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్‌ శేషాద్రి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఎస్వీ బద్రీపై టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక అసలు విషయానికొస్తే... డాలర్ శేషాద్రి వయసు రిత్యా రెండు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు. దానిలో భాగంగానే చెన్నైలోని అపోలోలో ఆయన ఇటీవల పరీక్షలకు వెళ్లొచ్చారు.
‍(చదవండి: శ్రీనివాసమూర్తి దీక్షితులు కన్నుమూత)

అయితే, డాలర్‌ శేషాద్రికి కరోనా పాజిటివ్ అంటూ బద్రీ వరుస ట్వీట్లు చేయడంతో వివాదాస్పదమైంది. డాలర్ శేషాద్రికి ఇప్పటికే మూడు సార్లు కోవిడ్ పరిక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. అయినా తనను మానసికంగా వేధించడంతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా బద్రీ ట్వీట్లు చేస్తున్నారంటూ శేషాద్రి వాపోయారు. ఇదిలాఉండగా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల 18 మంది అర్చకులకు కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ కాగా వారిలో కొందరు కోలుకున్నారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు.
(టీటీడీలో 170 మంది సిబ్బందికి పాజిటివ్)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top