విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | Man dies of Electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Nov 21 2015 3:09 PM | Updated on Sep 3 2017 12:49 PM

ఇంట్లో కరెంట్ రాకపోవడంతో తీగలు సరిచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

పొదలకూరు (నెల్లూరు) : ఇంట్లో కరెంట్ రాకపోవడంతో తీగలు సరిచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్ ఖాజామొయినొద్దీన్(30) ఇంట్లో రెండు రోజులుగా వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించగా.. ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement