రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Oct 13 2015 4:24 PM | Updated on Aug 30 2018 3:56 PM

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చెంచుగుడి క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

వెదురుకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చెంచుగుడి క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం చిట్టత్తూర్ ఆది ఆంధ్రవాడకు చెందిన ఎ. కాంతారావు వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలోని తన అత్తగారింటి వెళ్లాడు. మంగళవారం అక్కడి నుంచి స్కూటర్‌పై తిరుగు ప్రయాణం అయ్యాడు. చెంచుగుడి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం అతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement