ఆటో బోల్తా : వృద్ధుడు మృతి | man dies in road accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా : వృద్ధుడు మృతి

May 7 2015 8:34 PM | Updated on Sep 3 2017 1:36 AM

రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.

కనేకల్ (అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బ్రహ్మసముద్రం గ్రామ సమీపంలో వేగంగా వెళ్తున్న ఆటో మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వండ్రప్ప(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement