పంటకాలువలోకి దూసుకెళ్లిన బైక్: వ్యక్తి మృతి | Man dies in freak accident | Sakshi
Sakshi News home page

పంటకాలువలోకి దూసుకెళ్లిన బైక్: వ్యక్తి మృతి

Jan 10 2016 10:26 AM | Updated on Apr 3 2019 7:53 PM

తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలో పడి మృతిచెందాడు.

వీరవాసరం (పశ్చిమ గోదావరి) : తెల్లవారుజామున ద్విచక్రవాహనంపై పొలం వద్దకు వెళ్తున్న వ్యక్తి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పంటకాలువలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పోలేరుచింత గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది.

బంటుమిల్లికి చెందిన వేండ్ర వెంకటేశ్వర్లు(50) బైక్‌పై పొలం వద్దకు వెళ్తుండగా.. బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement