నెల్లూరు జిల్లాలో రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
Aug 1 2016 9:15 PM | Updated on Nov 6 2018 7:56 PM
నెల్లూరు (క్రైమ్) : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. బుజబుజనెల్లూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన ఎస్‌కే రియాజ్‌బాషా (50)కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తాను చనిపోతే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నంబర్‌తో లేఖరాసి అయ్యప్పగుడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో చెన్నై వైపు వెళ్లే రైలు కిందపడి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ జోసఫ్ విజయ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అతని ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా? మరే ఇతర కారణమా అనేది విచారణలో తేలాల్సి ఉంది. జోసఫ్ విజయకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రైల్లోంచి జారిపడి మహిళ..
రైల్లోంచి జారిపడి గురుతెలియని మహిళ (50) మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామన మాగుంట లేఅవుట్ సమీపంలోని రామిరెడ్డి డ్రెయిన్ అండర్ బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. ఎరుపు, నలుపు, పసుపు మిళితమైన పూలు కలిగిన చీర, గులాబి రంగు జాకెట్ ధరించి ఉంది. ఘటనా స్థలాన్ని రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వరలక్ష్మి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement