పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide in front of Police station | Sakshi
Sakshi News home page

పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Nov 20 2015 7:44 PM | Updated on Aug 21 2018 9:20 PM

దొంగతనం కేసులో విచారించడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తుగ్గలి (కర్నూలు) : దొంగతనం కేసులో విచారించడానికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల పరిధిలోని బొండిమాదుగుల గ్రామానికి చెందిన హరి(28)ని వారం రోజుల క్రితం ఓ దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement