ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide for 'Special Status' to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Aug 22 2015 6:07 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు.

పామర్రు (కృష్ణా) : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పామర్రుకు చెందిన సుబ్బారావు(35) ఐటీఐ పూర్తి చేశాడు. అయితే అతనికి ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఉపాధి అవకాశం దొరుకుతుందని ఆశపడ్డాడు.

కానీ ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటమార్చడంతో తీవ్ర నిరాశ చెందాడు. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నానని ఉత్తరం రాసి ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement