అడపిల్ల పుట్టిందని..మామ తలపగలగొట్టాడో అల్లుడు
అడపిల్ల పుట్టిందని..మామ తల పగలగొట్టాడో అల్లుడు... వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన ప్రదీప్, మంజుల దంపతులకు ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి ప్రదీప్ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నేపధ్యంలోనే గురువారం పుట్టిన బిడ్డపై దాడికి ప్రయత్నించగా.. అక్కడే ఉన్న మామ శ్రీనివాసులు అడ్డుకున్నాడు.. దీంతో ఆగ్రహం చెందిన ప్రదీప్ మామను.. పక్కనే ఉన్న సుత్తితో తలపై బలంగా కొట్టాడు.. దాడిలో శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.