కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.
కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. మంగళవారం ఉదయం ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. ఆయన రాకను పసిగట్టిన మీడియా హుటాహుటిన మల్లాది ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎక్కడికీ పారిపోలేదనీ.. దైవ దర్శనం కోసం షిరిడీ, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లానని అన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం విచారణ బృందం ఎదుట హాజరవుతానన్నారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించిన విచారణలో పూర్తిగా సహకరిస్తానన్నారు. కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడడం పద్ధతి కాదనీ, బుధవారం మధ్యాహ్నం అన్ని వివరాలూ వెల్లడిస్తానని చెప్పారు. అప్పటి వరకూ పాత్రికేయలు సహకరించాలని కోరారు. అనంతరం మల్లాది విష్ణు పార్టీ ముఖ్య నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు.