చెత్త సింగారం | make up a dest..... | Sakshi
Sakshi News home page

చెత్త సింగారం

Feb 18 2014 2:45 AM | Updated on Sep 2 2017 3:48 AM

చెత్త సింగారం

చెత్త సింగారం

మండల పరిధిలోని సమితిసింగారం పంచాయితీ పరిధిలో సమస్యలు పేరుకుపోతున్నాయి.

 చెత్త సింగారం
 మణుగూరు :
 మండల పరిధిలోని సమితిసింగారం పంచాయితీ పరిధిలో సమస్యలు పేరుకుపోతున్నాయి. పంచాయితీ పరిధిలోని అశోక్‌నగర్, సాయినగర్, రాజీవ్‌గాందీనగర్, వెంకటపతినగర్, అరుందతీనగర్, కూనవరం ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త నిండి ఉంటుంది. కుండీలు నిండినా పట్టించుకనే దాఖలాలులేవు. అశోక్‌నగర్‌లోని ప్రధాన రహదారిలో దుమ్ము కారణంగా ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. పాలక మండలి ఏర్పాటై ఆరు నెలలు దాటినా పంచాయితీలో ఎటువంటి అభివృద్ది జరగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement