ఫిబ్రవరి13నే మహాశివరాత్రి | maha shivaratri festival on february 13th | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి13నే మహాశివరాత్రి

Jan 30 2018 2:44 AM | Updated on Oct 8 2018 4:35 PM

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 13నే మహాశివరాత్రిని నిర్వహిం చేందుకు ఇదివరకే వైదిక కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీశైల దేవస్థానం స్థానాచార్యులు çపూర్ణానందస్వామి చెప్పారు. సోమవారం ఆయన శ్రీశైలంలో విలేకరులతో మాట్లాడారు. శివరాత్రి ఎప్పుడన్న విషయంపై ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగంలోనూ 13నే మహాశివరాత్రిగా పేర్కొన్నారని గుర్తుచేశారు. మిగిలిన అనేక పంచాంగాల్లో కూడా ఇదే ఉందని చెప్పారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 14న అని కొందరు అంటున్నప్పటికీ 13నే జరుపుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement