ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు | Lovers returned to home with rajasthan police | Sakshi
Sakshi News home page

ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు

May 28 2015 12:08 PM | Updated on Sep 3 2017 2:50 AM

ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు

ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు

రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చి... విజయవాడ శివారులోని కానూరులో తలదాచుకున్న ఓ ప్రేమ జంటను ఆ రాష్ట్ర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడ: రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చి... విజయవాడ శివారులోని కానూరులో తలదాచుకున్న ఓ ప్రేమ జంటను ఆ రాష్ట్ర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్లోని పఠాన్జోన్సిరి మండలం బార్విన్న గ్రామానికి చెందిన పూరన్కుమారి, బాబూరాం గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయం పెద్దలకు తెలిసింది. దాంతో వారిని కట్టడి చేశారు. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయారు. ఆ క్రమంలో కానూరు వచ్చారు.

స్థానికంగా ఉంటున్న ఆదే గ్రామానికి చెందిన రత్నరాందేవసి ఇంట్లో కొన్ని రోజులుగా తలదాచుకుంటున్నారు. కాగా పిల్లలు ఆచూకీ తెలియకపోవడంతో వారివారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రేమ జంట కానూరులో ఉన్నట్లు గుర్తించారు.  రాజస్థాన్ పోలీసులు కానూరు చేరుకుని ప్రేమజంటను గురువారం రాజస్థాన్ తీసుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement